నారింజలో అనేక పోషకాలు ఉంటాయి. నారింజలో విటమిన్ సి, డైటరీ ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.

శరీరానికి అతి ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లు కూడా నారింజలో అధిక మోతాదులో ఉంటాయి.

రాత్రి పడుకునే ముందు రోజూ నారింజ పండ్లు తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.

మనం ప్రతిరోజూ నారింజ పండ్లు తింటే శరీరం ఆహారం ద్వారా.. ఐరన్ గ్రహించడం సులభం అవుతుంది.

క్యాన్సర్ రావడానికి ఫ్రీ రాడికల్స్ ప్రధాన కారణం. ప్రతిరోజూ నారింజ తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

నారింజ పండ్లలో తగినంత మొత్తంలో విటమిన్ బి6, మెగ్నీషియం ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.