నెయ్యిలో అనేక పోషకాలు ఉంటాయి. నెయ్యి శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.
నెయ్యి తినడం వల్ల రక్తపోటు, అజీర్తి, మలబద్ధకం, పీసీఓఎస్ సమస్యలు కూడా తగ్గుతాయి.
గుండె ఆరోగ్యానికి, నాడీ వ్యవస్థ పనితీరుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
దగ్గు, జలుబు వంటి వాటికి నెయ్యి ఔషధంగా పనిచేస్తుంది.
నెయ్యి చర్మ సౌందర్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది.
చర్మంపై ఉన్న వాపు, మంటలు, అలర్జీలతో పాటు ఎన్నో చర్మ సమస్యలను ఇది తగ్గిస్తుంది.
నెయ్యిలో ఒమేగా ప్యాటీ యాసిడ్స్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఇవి చర్మానికి హాని చేసే ప్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి. అంతే కాకుండా చర్మానికి పోషణను అందిస్తాయి.
నెయ్యి తేమను అందించి ఆరోగ్యకమైన మెరిసే చర్మాన్ని మీ సొంతమయ్యేలా చేస్తుంది.
డల్ స్కిన్ ఉన్న వారు నెయ్యిని ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు.