అల్లం రసం తాగండి.. ఆరోగ్యంగా ఉండండి
పరగడుపున అల్లం రసం తాగడం వల్ల పైత్యం పోతుంది. వికారం సమస్య తగ్గుతుంది.
స్త్రీలు పీరియడ్స్ ప్రారంభానికి ముందు తాగితే.. రుతు సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుంది.
కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.
రక్త సరఫరా మెరుగుపడుతుంది. రక్త నాళాల్లో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి.
గ్యాస్, అసిడిటీ రాకుండా చేస్తుంది. మలబద్ధకం ఉండదు.
తలనొప్పి, దగ్గు, జలుబు సమస్యలను దూరం చేస్తుంది.
శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరవు.
గుండె పనితీరు మెరుగుపడుతుంది.
అల్లం తినడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది.