మందార పువ్వుల్ని ఎక్కువగా దేవుడిని పూజించడానికి వాడుతాం.

అలాగే జుట్టు పెరుగులకు మందారపువ్వులు, ఆకుల్ని వాడుతుంటాం.

మందారం ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. శరీరంలో ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది.

మందార మొగ్గల్ని గ్రైండ్ చేసి దాని రసం తాగితే రక్తహీనత తగ్గుతుంది.

మందారం టీ అధిక బరువును తగ్గిస్తుంది. త్వరగా ఆకలి వేయకుండా ఉంచుతుంది.

వృద్ధాప్య ఛాయల్ని తగ్గించే గుణాలు మందారపువ్వులో ఉన్నాయి.

మందార పువ్వులో యాంటీఏజింగ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది.

మందార పువ్వుల టీ తాగితే బీపీ కూడా కంట్రోల్ అవుతుంది.

జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

మందార ఆకుల్లో సి విటమిన్ పుష్కలం. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.