రోజూ జొన్న రొట్టె తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
జొన్నలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి ఉత్తమ ఆహారం.
జొన్నలో ఉన్న ఆహార ఫైబర్ పేగులను శుభ్రం చేసి మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది.
చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
జొన్నలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉండటం వల్ల ఎముకలు, కీ
వీటిలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల హీమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.
జొన్నలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
జొన్నలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచి ముడతలను ఆలస్యం చేస్తాయి.
మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే సమస్యలను కొంతవరకు తగ్గించడంలో జొన్న సహాయపడుతుంది.
మెగ్నీషియం కారణంగా నరాలకు ఉపశమనం కలిగిస్తుంది.
కాలేయంపై పేరుకుపోయే కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
శరీరంలో విషపదార్థాలను బయటకు పంపే ప్రక్రియకు తోడ్పడుతుంది.