వేసవిలో తప్పక తినాల్సిన ఆరోగ్యకరమైన పండు ఇదే..

లిచీ పండ్లు ఎన్నో పోషకాలతో నిండి ఉంటుంది. ఈ పండ్లలో విటమిన్స్, ఖనిజాలకి గొప్ప మూలమని చెప్పొచ్చు

మరి ఈ లిచీ పండ్ల ప్రత్యేకత, దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

లిచీలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

లిచీలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

లిచీలోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వృద్ధాప్య సంకేతాలను నివారిస్తుంది.

లిచీ తక్కువ కేలరీల పండు.. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

లిచీలోని యాంటీఆక్సిడెంట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

లిచీ పండ్లు నరాల సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.

లిచీలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

వీటిని ఖాళీ కడుపున (పరగడుపున) అస్సలు తినొద్దు. పచ్చిగా ఉండే లిచీ పండ్ల జోలికి అస్సలు వెళ్లొద్దు.

లిచీ పండ్లు కొన్నిసార్లు  కొన్ని ఇబ్బందులను కలిగి ఉండవచ్చు.    

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.(Image credit/Pixels)