మామిడి పండు.. పోషకాల మెండు
మామిడి పండ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో.. నిండిన ఒక పోషకమైన పండు.
మామిడి పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫోలేట్ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
మామిడి పండ్లలో ఫైబర్, ఎంజైములు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
మామిడిలో ఉండే విటమిన్ ఎ కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
మామిడి పండ్లలో పొటాషియం ఉంటుంది. ఇది గుండె జబ్బులను నియంత్రింస్తుంది.
పచ్చి మామిడి పండ్లలో లుటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి.
మామిడి పండ్లలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
మామిడిలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది.
మామిడి పండ్లు తినడం వల్ల ఎముకల ధృఢంగా మారతాయి.
మామిడి పండ్లు తింటే.. ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు దరి చేరవు.
మామిడి పండ్ల రసం చర్మానికి మృదుత్వాన్నిస్తుంది. చర్మంపై మచ్చలు, మొటిమలను తగ్గిస్తుంది.
ముఖ్య గమనిక: మామిడి పండ్లు మితంగా తీసుకోవాలి, ఎందుకంటే అధికంగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.