పోషకాలు ఫుల్.. ఫ్యాట్స్‌ నిల్!

సీమ చింతకాయలు.. వీటిని గుబ్బకాయలు, పులి చింతకాయలు అని కూడా అంటారు.

ఎంత రుచిగా ఉంటుందో.. అన్ని ప్రయోజనాలను అందిస్తుంది.

 నీటి శాతం అధికంగా ఉండే వీటిలో.. పోషకాలు కూడా దండిగా ఉంటాయి.

సీమ చింతకాయల్లో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, నియాసిన్, విటమిన్ సి అధికంగా ఉంటాయి.

వీటిని తింటే నోట్లో వచ్చే పూత సమస్యలను తగ్గిస్తాయి.

వీటిలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.

ఈ కాయల్లో ఉండే యాంటీ ఆక్సీడెంట్లు రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడతాయి.

ఈ గింజల నుంచి తీసిన నూనెను సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు.

గర్భిణులు వీటిని తీసుకుంటే.. కావాల్సిన కాల్షియం అందుతుంది. నీరసాన్ని తగ్గిస్తుంది.