ఆరెంజ్ జ్యూస్ తో ఆరోగ్య లాభాలు

ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉండడంతో దాని వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు లాంటి సమస్యలు రావు.

చర్మం కాంతివంతంగా మారేందుకు, త్వరగా ముడతలు పడకుండా ఉండేందుకు విటమిన్ సి అవసరం. ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి పుష్కలం.

ఎముకలకు బలం: ఆరెంజ్ లో కాల్షియం శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల బలంగా ఉపయోగపడుతుంది.

కిడ్నీ స్టోన్స్ : ఆరెంజ్ జ్యూస్ లో  సిట్రేట్ కాన్సట్రేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కిడ్నీలో ఏర్పడే కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ని బ్రేక్ చేస్తుంది.

గుండె ఆరోగ్యానికి మంచిది:  హైబిపిని తగ్గించి, గుండె అర్టరీస్ గట్టిపడకుండా అడ్డుపడుతుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది.

ఆరెంజ్ జ్యూస్ తాగడం కంటే నేరుగా ఆరెంజ్ పండు తినడంతో ఎక్కువ లాభాలున్నాయి.