వాల్‌నట్‌ను సూపర్‌ఫుడ్‌గా పిలుస్తారు. ఎందుకంటే ఇందులో మన శరీరానికి మేలు చేసే అనేక రకాల పోషకాలు ఉన్నాయి.

వాల్ నట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి.

ప్రతిరోజు ఉదయం పూట వాల్ నట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి.

వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.

ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.

ప్రతిరోజు ఉదయాన్నే వాల్ నట్స్ తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 

వాల్‌నట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు మెదడు అభివృద్ధికి చాలా మంచివి. 

ఇవి జ్ఞాపకశక్తికి పదును పెట్టడంతో పాటు మానసిక చురుకుదనాన్ని పెంచడంలో సహాయపడతాయి.

దీని రెగ్యులర్‌గా తినడం వల్ల డిమెన్షియా,  అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదం నుంచి బయటపడొచ్చు.