వెండి, బంగారమంటే స్త్రీలకు చాలా ఇష్టం.

వేడుక ఏదైనా.. వెండి, బంగారు నగలు ఉండాల్సిందే.

హిందూ సాంప్రదాయం ప్రకారం.. స్త్రీలు కొన్ని వెండి, బంగారు వస్తువులను ధరించాల్సిందే.

పిల్లల నుంచి పెద్దల వరకూ.. పట్టీలు పెట్టుకోవడం ఆచారం మాత్రమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి.

స్త్రీలకు శరీరంలో వేడి చాలా ఎక్కువ. వెండి పట్టీలు శరీరంలో వేడిని తగ్గిస్తాయి.

కాళ్లకింద ఉండే సున్నితమైన నరాల ద్వారా వెండి పట్టీలు వేడిని గ్రహిస్తాయి.

శరీరంలో ఎముకలు బలంగా మారుతాయి. వెండి చీలమండలను తాకి ఎముకలను బలోపేతం చేస్తుంది.

ప్రతి నెలా రుతుక్రమం సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. హార్మోన్ల సమస్యలు తలెత్తవు. హార్మోన్ల స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి.

మడమనాడిని తాకుతూ ఉండే పట్టీలు.. నాడుల ద్వారా మెదడుకు వెళ్లే ఆందోళన సంకేతాలను కంట్రోల్ చేస్తాయి.

స్త్రీలలో నడుము భాగాన్నీ బలంగా ఉంచుతాయి.