టాటూల వల్ల వచ్చే సమస్యలు ఇవే..

మారుతున్న జీవనశైలి, ఫ్యాషన్ కారణంగా టాటూలు(పచ్చబొట్టు) వేయించుకునేవారి సంఖ్య పెరిగింది.

వీటి వల్ల ఆరోగ్యంపై చెడు  ప్రభావం పడుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

న్యూయార్క్ లోని బింగ్ హాంమ్టన్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఆశక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

టాటూలు వేయించుకున్న వారు చర్మ, ఇతర ఆరోగ్య సమస్యలు బారిన  పడుతున్నట్లు అధ్యయనకర్తలు తేల్చారు.

టాటూ వేయడానికి ఉపయోగించే ఇంకులో "పాలిథీన్ గ్లైకాల్" అనే రసాయనం వల్ల  కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పేర్కొంది.

ఈ ఇంక్ లో ఉండే 2-ఫినాక్సిథెనాల్ చర్మంలోనికి వెళితే చర్మవ్యాధులు, ఊపిరితిత్తులు, కాలేయ సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

టాటూల్లోని రసాయనాలు చర్మం, ఆరోగ్యంపై దీర్ఘకాలం పాటు ప్రభావం చూపే అవకాశం ఉన్నందున  వీటికి దూరంగా  ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

టాటూలు వేయించుకున్నచోట చెమట గ్రంథులు సరిగ్గా పని చేయవు.

పచ్చబొట్టు వేసే సూదులు మంచివికాకుంటే ధనుర్వాతం, హెపటైటిస్ -బి,సి వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.