బాదం పప్పు తినడం వల్ల లాభాలు తెలుసా..?

బాదంపప్పులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు కొలెస్ట్రాల్  స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

బాదంపప్పులో రిబోఫ్లేవిన్, ఎల్-కార్నిటైన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

బాదంపప్పులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

బాదంపప్పులో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. బరువు నియంత్రణలో సహాయపడతాయి.

బాదంపప్పులో మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి మంచివి.

బాదంపప్పు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

విటమిన్ E వంటి పోషకాలు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి.

బాదం పప్పులు తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

బాదం పప్పులను ప్రతిరోజు తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఉదయాన్నే బాదంపప్పు తినడం వల్ల రోజుకు కావలసిన శక్తి లభిస్తుంది.

గర్భిణీ స్త్రీలు రోజూ తింటే.. బిడ్డ పెదుగుదల బాగుంటుంది.