చలికాలంలో ఇమ్యూనిటీ పెంచే బెస్ట్ ఫుడ్స్ ఇవే..

సాధారణంగా చలికాలంలో చాలా మందికి రోగనిరోధక శక్తి దెబ్బతిని, అనేక వ్యాధుల బారిన పడుతుంటారు. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఫుడ్స్ తినాల్సిందే..

బాదం, వాల్ నట్స్, చియా గింజలు, గుమ్మడి గింజలలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం ఇవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.

వెల్లుల్లి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. వీటిలో అలసిన్ అనే మూలకం ఉంటుంది. కాబట్టి తినే ఫుడ్‌లో ఇది ఉండేలా చూసుకోండి.

అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి గొంతు నొప్పి తగ్గించడంలో, జీర్ణవ్యవస్థను మెరుగు పరచడంలో సహాయపడుతుంది.

పసుపులో యాంటిబయాటిక్స్, కర్కుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

ఆరెంజ్, లెమన్, ద్రాక్ష వంటి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవి ఇమ్యూనిటిని పెంచడంలో సహాయపడుతుంది.

చిలకడదుంపలో కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

పాలకూరలో విటమిన్ సి, ఎ, యాంటీ ఆక్సీడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. సీజనల్ వ్యాధుల నుంచి వచ్చే ఇన్ఫెక్షన్‌ల నుండి రక్షిస్తాయి.