పిల్లల మెదడు పదును పెట్టడానికి, వారికి సరైన పోషకాహారం ఇవ్వండి.

పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి  పోషకాహారం చాలా ముఖ్యం.

నేటి పోటీ వాతావరణంలో, పిల్లలు షార్ప్‌గా ఉంటేనే  వారి చదువు, ఇతర కార్యకలాపాల్లో విజయం సాధించడానికి  అవకాశం ఉంటుంది.

 పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంపొందించేందుకు తినిపించాల్సిన ఆహార పదార్థాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 బాదం: పిల్లల మెదడు పని తీరును మెరుగుపరచడంలో బాదం అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఇందులో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు  ఉంటాయి. ఇవి మెదడును చురుకుగా చేస్తాయి.

2.వాల్నట్స్: వాల్నట్ ఆకారం మెదడులా ఉంటుంది. ఇది మీ మెదడుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి