స్నేహ అసలు పేరు సుహాసిని రాజారామ్ నాయుడు. తను 1981 అక్టోబర్ 12న ముంబాయ్‌లో పుట్టింది.
స్నేహ ఫ్యామిలీ తెలుగే అయినా తను పుట్టింది ముంబాయ్‌లో, పెరిగింది యూఏఈలోని షార్జాలో.
ఒక క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్లినప్పుడు స్నేహను చూసిన ఒక మలయాళ నిర్మాత తనను యాక్టింగ్‌లోకి తీసుకొచ్చారు.
‘ఇంగనే ఒరు నిలపాక్షి’ అనే మలయాళ మూవీతో సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయ్యింది స్నేహ.
ఎక్కువగా గ్లామర్ షో చేయకుండా పక్కింటమ్మాయి పాత్రలు చేస్తూ సౌత్ ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యింది.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఇలా అన్ని సౌత్ భాషల్లోనూ సినిమాలో చేసి గుర్తింపు దక్కించుకుంది.
2009లో ‘అచ్చముండు అచ్చముండు’ అనే మూవీలో ప్రసన్నతో కలిసి నటించి, అప్పుడే తనతో ప్రేమలో కూడా పడింది స్నేహ.
కొన్నాళ్లు ప్రేమలో ఎంజాయ్ చేసిన స్నేహ, ప్రసన్న.. 2012లో పెళ్లితో ఒక్కటయ్యారు.
వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లయినా, పిల్లలు పుట్టినా యాక్టింగ్‌ను మాత్రం ఎప్పుడూ పక్కన పెట్టలేదు స్నేహ.
ప్రస్తుతం హీరోయిన్‌గా కాకపోయినా సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ కెరీర్‌ను బిజీగా గడిపేస్తోంది స్నేహ.