ప్రస్తుతం అన్ని భాషల్లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనిరుధ్ రవిచందర్.

తనకంటే ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్లను వెనక్కి నెట్టి టాప్ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు.

కోలీవుడ్‌లో మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయమయిన అనిరుధ్.. ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలకు కూడా సంగీతాన్ని అందిస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు.

ప్రస్తుతం అనిరుధ్ చేతిలో ఉన్నవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. అందుకే తన రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్‌లో ఉంటుందని టాక్.

తెలుగులో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు అనిరుధ్.

తమిళంలో అజిత్ ‘విడాముయర్చి’, రజినీకాంత్ ‘కూలి’ చిత్రాలకు మ్యూజిక్ అందిస్తూ బిజీగా ఉన్నాడు.

పెద్ద సినిమాలు మాత్రమే కాదు.. ‘లవ్ ఇన్సురెన్స్ కంపెనీ’ లాంటి చిన్న బడ్జెట్ సినిమాలకు సంగీతాన్ని అందించడానికి కూడా అనిరుధ్ వెనకాడడు.

అనిరుధ్ రవిచందర్ 1990 అక్టోబర్ 16న జన్మించాడు. తన 34వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ఫ్యాన్స్ అంతా తనకు విష్ చేస్తున్నారు.

అనిరుధ్ పుట్టినరోజు సందర్భంగా తన రెమ్యునరేషన్ గురించి కూడా సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ నడుస్తోంది.

సినిమా బడ్జెట్‌ను బట్టి మ్యూజిక్ డైరెక్షన్ చేయడం కోసం రూ.10 నుండి 12 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తాడట అనిరుధ్.