ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ హానర్ తాజాగా తన లైనప్‌లో ఉన్న Honor 200 Lite 5G ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది.
దీని 8GB + 256GB వేరియంట్‌ను కంపెనీ 17,999 ధరతో అందుబాటులోకి తీసుకొచ్చింది./
అలాగే Honor 200 Lite 5G కొనుగోలు సమయంలో SBI ఖాతాదారులు రూ.2,000 తక్షణ తగ్గింపు పొందుతారు.
అమెజాన్, హానర్ వెబ్‌సైట్, ఎంపిక చేసిన స్టోర్‌ల ద్వారా సెప్టెంబర్ 27 నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.
ఈ Honor 200 Lite 5G మూడు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. అవి సియాన్ లేక్, మిడ్నైట్ బ్లాక్, స్టార్రి బ్లూ వంటివి ఉన్నాయి.
స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల పూర్తి HD+ (2,412 x 1,080 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఇది MediaTek Dimensity 6080 SoC చిప్‌సెట్‌ను పొందింది. ఆండ్రాయిడ్ 14-ఆధారిత MagicOS 8.0 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో నడుస్తుంది.
మ్యాజిక్‌ఎల్‌ఎమ్, మ్యాజిక్ పోర్టల్, మ్యాజిక్ క్యాప్సూల్, మ్యాజిక్ లాక్ స్క్రీన్, పారలల్ స్పేసెస్ వంటి అనేక AI ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.
ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మద్దతుతో కూడిన 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి.
ఇక ఫోన్ ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది. హానర్ 35W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4500mAh బ్యాటరీని ప్యాక్ చేసింది.
ఇది 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.1, OTG, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.