పాలు తాగడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ సరైన సమయంలో పాలు త్రాగకపోతే మాత్రం ఆరోగ్యానికి హానికరం
ఆహారం, పాల మధ్య ఎంత సమయం గ్యాప్ ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది రాత్రి నిద్రించే ముందు వేడి పాలు త్రాగడానికి ఇష్టపడతారు.
రాత్రి భోజనం చేసిన కొద్దిసేపటికే పాలు తాగుతుంటారు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.
మీకు పాలలోని పూర్తి ప్రయోజనాలు కావాలంటే, వాటిని తాగే విధానం కూడా ముఖ్యం.
తిన్న వెంటనే పాలు తాగడం మానుకోవాలి. నిజానికి తిన్న కొద్దిసేపటికే పాలు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
మనం తిన్న ఆహారం గంటసేపు మన కడుపులో ఉంటుంది. అంటే, ఈ సమయంలో ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ జరుగుతుంది.
అటువంటి పరిస్థితిలో, కొంత సమయం తర్వాత పాలు తాగినప్పుడు అది కడుపులోని ఆహారంలో కలిసిపోతుంది.
ఆయుర్వేదంలో పాలు, ఉప్పును వ్యతిరేక ఆహారాలుగా పరిగణిస్తారు. అందుకే పాలు, ఉప్పు కలిసి శరీరానికి అనేక సమస్యలను కలిగిస్తాయి.
పాల యొక్క పూర్తి ప్రయోజనాలు ఎవరైనా కోరుకుంటే మాత్రం వారు భోజనం తర్వాత కనీసం ఒక గంట గ్యాప్ తీసుకున్న తర్వాత మాత్రమే పాలు తాగాలి.