ఉదయం నిద్రలేవగానే ఆకలి వేస్తోందా..?
కొందరికి ఉదయం లేవగానే ఆకలి వేస్తుంది. రాత్రిపూట కడుపునిండా భోజనం చేసిన ఉదయం లేచిన వెంటనే ఏదైనా తినాలనే కోరిక పుడుతుంది.
మీరు రాత్రి సమయంలో మీ శరీరం శక్తిని కోల్పోతుంది. ఇది ఉదయం ఆకలికి కారణం కావచ్చు.
తగినంత నీరు లేకపోవడం వల్ల కూడా ఆకలి కారకమైన దాహం కావచ్చు. తగినంత నీరు తాగడం ద్వారా ఆకలిని తగ్గించవచ్చు.
నిద్రలేకపోవడం, ఒత్తిడి వల్ల కూడా ఆకలిని ఎక్కువగా పెంచుతుందని చెబుతున్నారు.
అలాగే కొన్ని రకాల మందులు వాడిని ఆకలిని పెంచుతుంది.
పోషకాలు సమృద్ధిగా ఉండే డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే చాలా మంచిది.
ఉదయం మేల్కొగానే అల్పాహారంగా ఒక గిన్నె ఓట్ మీల్ తింటే ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది.
మీ ఉదయపు ఆకలిని తీర్చుకోవడానికి తేలికైన, పోషకాలున్న ఆహారం తినాలని కోరుకుంటే అరటిపండు బెస్ట్ ఛాయిస్.
కొబ్బరి నీళ్లు తాగితే రాత్రంతా డీహైడ్రేషన్ అయిన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలను తక్షణమే అందిస్తుంది.
ప్రతి రోజూ 7-8 గంటల నిద్ర పోవాలి, అలాగే ఒత్తిడిని తగ్గించడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు.
నిగనిగలాడే వాటర్ యాపిల్స్ ఎప్పుడైనా తిన్నారా?