చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే పానీయాలు ఇవే..
యాంటీ ఆక్సిడెంట్స్ కోసం పాలలో కొద్దిగా పసుపు, తేనె, నల్లమిరియాల పొడి వేసుకొని తాగండి.
జింజర్ లెమన్ టీ.. వేడి నీటిలో అల్లం, నిమ్మరసం, తేనె కలుపుకొని వేడివేడిగా తాగాలి.
తులసి పుదీనా టీ.. వేడి నీటిలో తులిస ఆకు, పుదీనా, తేనె కలిపి తాగితే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
మసాలా ఆపిల్ సైడర్.. కాస్త వేడి నీటిలో లవంగాలు, దాల్చిని చెక్క, యాపిల్ జ్యూస్ కలిపి తాగండి
ఆమ్లా జింజర్ జ్యూస్.. తాజా ఉసిరి, అల్లం, తేనె కలిపి తాగేయండి. ఈ డ్రింక్స్ అన్నీ చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.