DC vs SRH మ్యాచ్ విశేషాలు..

వరుసగా మూడు మ్యాచుల్లో 250కి పైగా పరుగులు చేసిన జట్టుగా SRH రికార్డ్

SRH- 266/7  ఐపీఎల్‌ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోర్

సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో మొత్తం 22 సిక్సర్లు నమోదయ్యాయి

ఈ మ్యాచ్‌లో మొత్తం 71 బౌండరీలు నమోదయ్యాయి

16 బంతుల్లోనే హెడ్ హాఫ్ సెంచరీ చేశాడు. సన్‌రైజర్స్ తరఫున వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్ శర్మ సరసన నిలిచాడు.

ఇన్నింగ్స్ 3 ఓవర్లలోపు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హెడ్.. మొత్తంగా కేఎల్ రాహుల్, జైశ్వాల్ హెడ్ కంటే ముందున్నారు.

SRH కేవలం 5 ఓవర్లలోనే 100 పరుగులు చేసింది.  ఐపీఎల్ చరిత్రలో ఇదే వేగవంతమైన 100

పవర్ ప్లేలో అత్యధిక స్కోర్ 125/0 నమోదు చేసిన SRH..  పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో రికార్డ్

10 ఓవర్లు ముగిసేలోపు సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోర్ 158/4. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధికం

ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు జేక్ ఫ్రేజర్ 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ఢిల్లీ తరఫున వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

సన్‌రైజర్స్ బౌలర్ నటరాజన్ 19 పరుగులకే 4 వికెట్లు తీసుకుని తన అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు.

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఢిల్లీపై 67 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది.