మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ వ్యాయామం చేయడం చాలా ముఖ్యం.

దానికోసం ఎక్కువ బరువులు ఎత్తకుండా యోగా, నడక, పరుగు లాంటివి చేస్తే చాలు.

మనం ఎంత సేపు వ్యాయామం చేసామనే దానికంటే.. ఏ సమయంలో చేస్తున్నామనేది చాలా ముఖ్యం.

సాయంత్రం 4 గం. నుంచి రాత్రి గం. మధ్య చేసే వ్యాయామం శరీరంపై ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

సాయంత్రంవేళ చేసే వ్యాయామాలే శరీరంపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.

ఒకవేళ ఉదయం సమయంలో ఎక్సర్‌సైజ్‌లు చేసేవారు కంగారు పడాల్సిన పనిలేదు.

వారు కూడా గరిష్ఠ ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

అయితే రోజూ ఒకే సమయంలో వ్యాయామం చేయడం అనేది అతి ముఖ్యం.