ఐటెల్ రంగులు మార్చే స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఐటెల్ కలర్ ప్రో 5 జీ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయనుంది.
స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లు లీక్ అయ్యాయి.
ఫోన్ డిస్‌ప్లే, ప్రాసెసర్ వివరాలను వెల్లడించారు.
15,000 కంటే తక్కువ ధరకే ఈ ఫోన్ లాంచ్ అయే అవకాశం ఉంది.
Itel Color Pro 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను MySmartPrice వెల్లడించింది.
స్మార్ట్‌ఫోన్‌లో HD ప్లస్ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల LCD ప్యానెల్ ఉంటుంది.
అలానే సెల్ఫీ కెమెరా కోసం వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్ ఉంటుంది.
కలర్ ప్రో 5G మీడియాటెక్ డైమెన్సిటీ 6080 5G ప్రాసెసర్‌తో వస్తుంది.
Itel Color Pro 5G స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ చిప్‌సెట్ 6nm ప్రాసెస్‌పై ఆధారపడి ఉంటుంది.