అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

2018లో ధడక్ సినిమా ద్వారా వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది జాన్వీ

ఇక ప్రస్తుతం తెలుగులో దేవర సినిమాతో అడుగుపెట్టనుంది జాన్వీ కపూర్

దేవర రిలీజ్ కాకముందే జాన్వీ.. చరణ్ సరసన RC16 లో నటిస్తుంది

సోషల్ మీడియాలో అందాలను ఆరబోయడం జాన్వీకి తెలిసినట్లు మరెవ్వరికీ తెలియదు

జాన్వీ అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు

ఇక తాజాగా జాన్వీ కపూర్.. అనంత్ అంబానీ పెళ్ళిలో దేవకన్యలా మెరిసింది

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల సంగీత్ వేడుకలో జాన్వీనే సెంట్రాఫ్ అట్రాక్షన్

నీలం మరియు ఆకుపచ్చ షేడ్స్‌లో జాన్వీ కపూర్ మెరిసే లెహంగా రాయల్టీని వెదజల్లింది

నెమలి ఈకలతో ఆమె లెహంగా డిజైన్ చేయగా.. పైన ట్రాన్సఫరెంట్ జాకెట్.. అదే కలర్ దుపట్టాతో దేవకన్యలా మెరిసింది

ప్రస్తుతం జాన్వీ కపూర్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి