జీలకర్రతో అనేక ప్రయోజనాలు ఉంటాయి.  జీలకర్ర నీరు  కూడా శరీరానికి చాలా మేలు చేస్తుంది.

శరీరంలో ఉండే మురికిని అంటే బాడీ డిటాక్స్‌ని తొలగించడంలో జీలకర్ర నీరు చాలా మేలు చేస్తుంది.

జీలకర్ర నీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు ఉన్నవారికి మేలు జరుగుతుంది.

దీంతో పాటు, జీలకర్ర నీరు  బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

జీలకర్ర జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. ఇది  జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.

జీలకర్ర నీరు జీవక్రియను పెంచుతుంది. అంతే కాకుండా శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది.

ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది .ఆకలిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి.