జామకాయలు ఎందుకు తినాలంటే?

జామకాయల్లో విటమిన్ సి బాగా ఉంటుంది. ఇది జలుబు, ఇన్ఫెక్షన్లను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఇందులో ఫైబర్ ఎక్కువ. కాబట్టి జీర్ణం సులువవుతుంది, మలబద్ధకం రాకుండా చూస్తుంది.

జామకాయలు షుగర్ లెవెల్స్‌ని అదుపులో ఉంచుతాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లకి ఇవి బాగా పనికొస్తాయి.

ఇందులో పొటాషియం, ఫైబర్ ఉంటాయి. బీపీ కంట్రోల్ చేస్తాయి, చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి.

జామకాయంలోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ వచ్చే చాన్స్ తగ్గిస్తాయి.

ఇందులో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ.

జామకాయను తరచుగా తింటే బరువు తగ్గడం సులభమవుతుంది.

Pic credits: Pexels