ఈ లోపాలు ఉంటే.. మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే..

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీలు సక్రమంగా పని చేయడం చాలా అవసరం.

కిడ్నీలు ప్రమాదంలో ఉంటే.. చేతులు, కాళ్లలో వాపులు మొదలవుతాయి.

నీరసం, అలసటగా అనిపించినా.. కిడ్నీల పనితీరు మందగించి రక్తంలోనే మలినాలు నిలిచి బలహీనంగా చేస్తాయని వెల్లడిస్తున్నారు.

కిడ్నీలు పాడైనట్లయితే చర్మంపై దురద రావడం, చర్మం ఆరిపోవడం లాంటి సమస్యలు కలుగుతాయి.

వికారం, వాంతులు వంటివి కూడా దీనికి కారణమంటున్నారు.

తరచూగా కండరాల్లో తిమ్మిర్లు ముఖ్యంగా కాళ్లలో రావడం కిడ్నీ వ్యాధులకు హెచ్చరిక అని నిపుణులు చెబుతున్నారు.

కిడ్నీ వ్యాధులు వచ్చినప్పుడు యూరిన్‌లో మార్పులు కనిపిస్తాయని చెబుతున్నారు.

కిడ్నీల పనితీరు సరిగ్గా లేనట్లయితే జీర్ణ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అలాగే మెదడు పనితీరు దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుంది.