ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటోరోలా ఇటీవలే ఎడ్జ్ ఫ్యూజన్ 50 మొబైల్‌ను లాంచ్ చేసింది

వేగన్ లెదర్ డిజైన్‌తో కూడిన ఈ ప్రీమియం మొబైల్ మొదటి సేల్ మే 22 నుంచి స్టార్ట్ అయింది.

ఈ ఫోన్‌ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో స్టార్ట్ కాగా.. మొదటి సేల్‌లో భారీ తగ్గింపులతో కొనుగోలు చేయవచ్చు.

ఈ మొబైల్ 8GB ర్యామ్ /128GB స్టోరేజ్ ధర   రూ.22,999 గా కంపెనీ నిర్ణయించింది. 

అలాగే 12GB ర్యామ్ /256GB స్టోరేజ్ ధర రూ.24,999గా కంపెనీ నిర్ణయించింది.

కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ ప్రయోజనాన్ని పొందవచ్చు.

అంతేకాకుండా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 2,000 వరకు తగ్గింపును అందిస్తోంది.

అలాగే ఈ ఫోన్‌ను రూ.2,556 నెలవారీ EMI ఎంపికతో కూడా కొనుగోలు చేయవచ్చు.

ఇది Qualcomm Snapdragon 7s Gen 2 ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది.