ఆరోగ్యానికి మంచిదని మల్బరీ ఫ్రూట్‌ తింటున్నారా?

వేసవిలో విపరీతంగా చెమట పట్టడం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే మల్బరీ పండును తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు.

ఇది మూడు రకాలుగా లభిస్తాయి. అవి వైట్, రెడ్, బ్లాక్ మల్బరీలు.

దీనిలో క్యాలరీలు, సోడియం, ప్రొటీన్స్, విటమిన్స్, పొటాషియం, కార్బోహైడ్రేట్ వంటివి పుష్కలంగా లభిస్తాయి.

మల్బరీలు తినడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

ఇవి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇంప్లమేషన్‌ని రెడ్యూస్ చేస్తాయి.

అలాగే బాడీలో బ్లడ్ షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తాయి.

మల్బరీలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఎర్రరక్తకణాల ప్రొడక్షన్ పెరుగుతుంది.

మల్బరీలో ఉండే యాంతోసియానిన్స్ క్యాన్సర్ కణాలను దూరంగా ఉంచుతాయి.

ఇందులోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

అంతేకాకుండా మల్బరీలు చర్మాం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, హెయిర్ ఫాల్‌ని రెడ్యూస్ చేస్తాయి.