మనలో చాలా మందికి గోర్లు కొరికే అలవాటు ఉంటుంది.

ఒత్తడికి లోనైనప్పుడు గోర్లు కొరడం చేస్తుంటాం. ఈ అలవాటు చాలా ప్రమాదకరం అని మీకు తెలుసా ?

గోళ్ల క్రింద అనేక రకాల బ్యాక్టీరియా ధూళి వంటివి ఉంటాయి. గోళ్లు కొరకడం వల్ల బ్యాక్టీరియా నోటిలోకి వెళ్తుంది.

గోళ్లు కొరకడం వల్ల బ్యాక్టీరియా దంతాల చిగుళ్లలోకి వెళ్తుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్లు వస్తాయి.

గోళ్లను తరచుగా కొరకడం వల్ల వాటి సహజ ఆకారం దెబ్బతింటుంది. గోళ్లు బలహీనంగా మారతాయి.

పదే పదే గోళ్లు కొరకడం వల్ల దంతాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఎనామిల్ అరిగిపోయేలా చేస్తుంది.

తరచుగా గోళ్లు కొరకడం వల్ల చుట్టూ ఉన్న చర్మం ఊడిపోతుంది. కొన్ని సార్లు రక్తం కూడా వస్తుంది.

గోళ్లు కొరకడం తరచుగా మానసిక ఒత్తిడికి సంకేతం కాబట్టి దీనిని తగ్గించుకోవాలి.