వేప ఆకులానే వేప పువ్వులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

వేప పువ్వు జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

వేప పువ్వు పొడిలో నీళ్లు కలిపి మొటిమలపై రాస్తే.. మొటిమలు తగ్గిపోవడమే కాకుండా మచ్చలు కూడా తొలగిపోతాయి.

కొన్ని వేప పువ్వులను ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది.

వేప పువ్వు పొడిలో నీటిని కలిపి తలకు బాగా పట్టించి మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. తరుచూ ఇలా చేస్తూ ఉంటే చుండ్రు, దురద వంటి సమస్యలు తగ్గిపోతాయి.

వేప పువ్వు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. వేప పువ్వుకు పురుషత్వాన్ని పెంచే శక్తి  ఉంది.

తలనొప్పి, చెవినొప్పితో బాధపడేవారు వేప పువ్వులు వేసి ఆవిరిపట్టుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.

కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులతో బాధపడేవారు వేప నూనెను రాసుకుంటే నొప్పి తగ్గుతుంది.