డైటింగ్ పేరుతో నెలల తరబడి అన్నం తినడం మానేస్తుంటారు

కేవలం పండ్లు, నట్స్, జ్యూస్‌లు వంటి వాటితో రోజంతా గడిపేస్తుంటారు

ఇలా చేయడం వల్ల నెలలో దాదాపు 2 నుంచి 3 కిలోల వరకు బరువు తగ్గొచ్చు

జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం పేరుతో 2018లో చేసిన అధ్యయనంలో తేలింది

ఇలా చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరంలో శక్తిని కూడా కోల్పోతారట

నెలల తరబడి అన్నం తినకపోవడం వల్ల శరీరం శక్తిని కోల్పోయి, కండరాలు క్షీణించి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి

అందువల్ల అన్నం తినడం పూర్తిగా మానేయకుండా, ఇతర పదార్థాలతో పాటు అన్నంను కూడా ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు