వన్‌ప్లస్ నార్డ్ సిఈ4 ఫోన్ అమెజాన్‌లో ప్రారంభమైన మొదటి రోజే భారీ అమ్మకాలను నమోదు చేసి రికార్డు సృష్టించింది.

దాదాపు 20K నుంచి 25K విభాగంలో వన్‌ప్లస్ నార్డ్ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా అవతరించినట్లు కంపెనీ వెల్లడించింది.

8బీజీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను కంపెనీ రూ.24,999గా నిర్ణయించింది.

8 జీబీ ర్యామ్ + 256 జీబీ వేరియంట్‌ను రూ.26,999గా తీసుకొచ్చింది.

HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.1250 వరకు, డెబిట్ కార్డు ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.1500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

వన్‌కార్డ్ క్రెడిట్ కార్డు ట్రాన్షక్షన్‌పై రూ.1500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. వీటితో మరింత తక్కువ ధరకే ఈ మొబైల్‌ను కొనుక్కోవచ్చు.

8/128జీబీ వేరియంట్‌పై రూ.23,250 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది.

అలాగే 8/256 జీబీ వేరియంట్‌పై రూ.25000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు.

అప్పుడు వరుసగా ఈ మొబైల్స్‌ను.. రూ.1749, రూ.1999లకే కొనుక్కోవచ్చు.

ఇంత మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందాలంటే పాత ఫోన్ కండీషన్ మంచిగా ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు.