విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్‌తో క్రికెట్ ప్రపంచమంతా షాక్ లో ఉంది.

జూన్‌లో ఇంగ్లాండ్‌తో జరగాల్సిన టెస్ట్ సిరీస్ లో కోహ్లీ స్థానంలో ఎవరు ఆడతారనేది పెద్ద ప్రశ్నగా మారింది.

టెస్ట్ టీమ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో కోహ్లీ నాలుగో స్థానంలో వచ్చేవాడు. ఆ స్థానం కోసం ఇప్పుడు అయిదుగురు పోటీపడుతున్నారు.

సర్‌ఫరాజ్ ఖాన్.. 2024లో ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్‌లో అరంగ్రేటం చేశాడు. కోహ్లీ రెండోసారి తండ్రి కావడంతో బ్రేక్ తీసుకోగా ఎంట్రీ ఇచ్చాడు.

శ్రేయస్ అయ్యర్.. టి20, వన్డేల్లో అదరగొట్టే పర్ఫామెన్స్ తరువాత అయ్యర్ కూడా కోహ్లీని రిప్లేస్ చేయగలడు.

సాయి సుదర్శన్.. ఐపిఎల్ విజృంభించి అందరినీ ఆకట్టుకున్న తరువాత టెస్టుల్లో ఇదే అతనికి తొలి అవకాశం అవుతుంది.

రజత్ పాటిదార్.. 2024లో చివరిసారిగా టెస్టుల్లో ఆడాడు. ఇప్పుడు కోహ్లీ ప్రత్యామ్నం అయ్యే అర్హతలున్నాయి.

దేవ్ దత్ పడిక్కల్.. వన్డే, టి20ల్లో ఇప్పటివరకు మంచి ఆటతీరు చూపించాడు. టెస్ట్ ఫార్మాట్ లో ఇదే తొలిసారి అవుతుంది.