ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్ పోకో తాజాగా చౌక ధరలో మరో ఫోన్‌ను రిలీజ్ చేసింది.

పోకో సి 61 పేరుతో కొత్త మొబైల్‌ను భారతదేశంలో విడుదల చేసింది.

ఇది 4 జీబీ ర్యామ్ + 64 బీజీ స్టోరేజ్, అలాగే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వంటి  రెండు వేరియంట్లలో రిలీజ్ అయింది.

4/64 జీబీ వేరియంట్ ధర రూ.7,499గా కంపెనీ నిర్ణయించింది.

అలాగే 6/128 జీబీ వేరియంట్‌ను రూ 8,499లతో కొనుక్కోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ యూపీఐ ద్వారా ఫస్ట్ ఆర్డర్ చేస్తే రూ.250కి పైగా ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకే అభిస్తుంది.

ఇది డైమండ్ డస్ట్ బ్లాక్, ఎథెరియల్ బ్లూ, మిస్టికల్ గ్రీన్ వంటి కలర్ ఆప్షన్‌లలో వచ్చింది.

ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కొనుక్కోవచ్చు.

poco c 61