పోకో కంపెనీ Poco M6లో మరో వేరియంట్‌ను 4జీ వెర్షన్‌లో మార్కెట్‌లో దించింది. దీనిలో హై క్వాలిటీ కెమెరా, అధిక శక్తినిచ్చే బ్యాటరీ ప్యాక్‌ని అందించింది.

Poco M6 ఫోన్‌ను రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. అందులో 6 GB RAM + 128 GB స్టోరేజ్ ధర  రూ. 10,700 ఉంటుంది

అలాగే 8 GB RAM + 256 GB స్టోరేజ్ ధర రూ. 12,400 ధరకు వస్తుంది. ఇది బ్లాక్, సిల్వర్, పర్పుల్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేయబడింది.

ఇది 6.79-అంగుళాల IPS LCD ప్యానెల్‌‌తో పంచ్ హోల్ డిజైన్‌ డిస్ప్లేతో వస్తుంది.

ఫోన్ వెనుక భాగంలో 108-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీనితో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా అందించబడింది

ఈ ఫోన్ Android 14 ఆధారిత HyperOS స్కిన్‌పై నడుస్తుంది. అలాగే Helio G91 అల్ట్రా చిప్‌సెట్‌ను కలిగి ఉంది.

33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,030mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇది డ్యూయల్ సిమ్.. 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.4, USB-C కనెక్టివిటీని కలిగి ఉంది.

అందువల్ల తక్కువ ధరలో మంచి ఫీచర్లు, హై క్వాలిటీ కెమెరా గల ఫోన్‌ను కొనుక్కోవాలనుకుంటే ఇదే బెస్ట్ ఛాన్స్