కండకల వాడే మనిషోయ్ అంటూ ప్రముఖ కవి గురజాడ ఎప్పుడో అన్నారు.
దేహ దారుఢ్యం ఉంటేనే మనిషి కష్టమైన పనులు చేయగలడు.
అందుకే శరీరంలో కండల పెరుగుదల కోసం ప్రొటీన్ పోషకాలున్న ఆహారం తీసుకోవడం అవసరం.
చికెన్ బ్రెస్ట్ లో లీన్ ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది.
బలహీనంగా ఉన్నవారు త్వరగా కండలు పెంచడానికి ఇది ఎక్కువగా తీసుకోవాలి.
పెరుగులో ప్రొటీన్ తో పాటు జీర్ణశక్తిని పెంచే ప్రొబయోటిక్స్ ఎక్కువ.
గుడ్డులో మంచి ప్రొటీన్ పోషకాలున్నాయి. ఇందులోని అమినో యాసిడ్స్ కండల పెరుగుదలకు అద్భుతంగా తోడ్పడుతుంది.
కంది ప్పపు, పెసరపప్పు లాంటి అన్ని రకాల పప్పు ధాన్యాల్లో ఫైబర్ తో పాటు అధిక స్థాయిలో ప్రొటీన్ ఉంటుంది.
క్వినోవాలో మంచి ప్రొటీన్లుంటాయి. దీంతో ఉప్మా చేసుకొని తింటే కండలకు మంచి బలం.
టునా చేత మాంసంలో ప్రొటీన్ తోపాటు ఒమెగా 3 యాసిడ్స్ పుష్కలం.
కాటేజ్ చీజ్ లో అధిక స్థాయిలో ప్రొటీన్ ఉంటుంది. అయితే ఇది మెల్లగా జీర్ణం అవుతుంది.
కొబ్బరి నీరు తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు..