గారెలు, బూరెలు.. పూరీలకు ఉపయోగించే నూనెలను మళ్లీ మళ్లీ వాడుతున్నారా?

ఆ నూనెను వేరే కూరల్లో లేదా వేపుళ్లు.. పోపులలో వాడుతున్నారా?

వాడేసిన నూనెను పదే పదే వాడటం చాలా ప్రమాదకరమని పరిశోధకులు చెబుతున్నారు.

డీప్ ఫ్రై ఆయిల్స్ మరోసారి వాడితే న్యూరోడెజెనరేటివ్ వ్యాధులు వస్తాయి.

ఎలుకలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది.

రి-యూజ్డ్ ఆయిల్ వంటకాలు తిన్న ఎలుకల్లో న్యూరోడెజెనరేటివ్‌‌ను గుర్తించారు.

వాడేసిన నూనె పొట్ట, మెదడు, కాలేయం మధ్య సమతుల్యత దెబ్బతీస్తుందట.

అది న్యూరోడెజెనరేటివ్ సమస్య మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

కాబట్టి, వాడేసిన నూనెలను మళ్లీ మళ్లీ వంటల్లో వాడొద్దు. Images Credit: Pixabay and Pexels