ఇండియాలో టాప్ 7 ధనికులు వీరే

భారతదేశ సంపన్నుల్లో అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ ఉన్నారు. ఆయన నికర ఆస్తి 119.5 బిలియన్ డాలర్లు.

అంబానీ వెనకాలే అదానీ ఉన్నారు. గౌతమ్ అదానీ నికర ఆస్తి విలువ 116 బిలియన్ డాలర్లు.

జిందాల్ గ్రూప్ ఓనర్ సావిత్రి జిందాల్ 43.7 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు.

హెసిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ ఆస్తి విలువ 40.2 బిలియన్ డాలర్లు.

5వ స్థానంలో ఉన్న సన్ ఫార్మా కంపెనీ ఓనర్ దిలీస్ సంఘ్వి ఆస్తి 32.4 బిలియన్ డాలర్లు.

డిమార్ట్ ఓనర్ రాధా కిషన్ దమానీ ఆస్తి విలువ 31.5 బిలియన్ డాలర్లు.

ఎయిర్ టెల్ ఓనర్ సునీల్ మిట్టల్ 7 స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తి విలువ 30.7 బిలియన్ డాలర్లు.