ఇంటిలో వాతావరణం ప్రశాంతంగా ఉండాలంటే.. వాస్తుప్రకారం కొన్ని నియమాలు పాటించాలి.

ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, సమస్యలకు కారణం వాస్తు దోషాలే.

పూజామందిరం హృదయస్థానం. ఈశాన్యంలోనే పూజగది ఉండాలి.

పూజగదిలో పెట్టే దేవుడి ఫొటోలు కూడా పరిమితంగా ఉండాలి. ఎక్కువ ఫొటోలు పెట్టి పూజలు చేస్తే మంచిదనుకోవడం పొరపాటే.

కొందరికి పూర్వీకుల సంప్రదాయం ప్రకారం.. సింహాసనం ఆనవాయితీ ఉంటుంది.

ఇంకొందరు ఇలవేల్పును సింహాసన స్థానంలో ఉంచుతారు. ఆ తర్వాతే మిగతా దేవీ దేవతల విగ్రహాలకు ప్రాధాన్యమివ్వాలి.

ఇంటి యజమానికి పూజచేసే సమయం లేనప్పుడు ఇల్లాలు పూజ మందిరంలో, తులసికోట వద్ద దీపారాధన చేయాలి.

మహానైవేద్యం.. ఇంటి ఆనవాయితీ ఉంటేనే పాటించాలి. అలాంటి ఆనవాయితీ లేకపోతే అవసరం లేదు.

పండ్లు, కొబ్బరికాయ, పాలు వంటి ఆహారాలను నైవేద్యంగా పెట్టవచ్చు. స్వీట్లు, ఇతర పదార్థాలను పొరపాటున కూడా నైవేద్యంగా పెట్టరాదు.