సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శృతి హాసన్.. తాజాగా పర్పుల్ చీరలో ఫోటోషూట్ షేర్ చేసింది.
పర్పుల్ చీర, బ్లాక్ కలర్ షిమ్మరింగ్ బ్లౌజ్లో శృతి చాలా హాట్‌గా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఒకవైపు సినిమాలు, మరోవైపు సోషల్ మీడియా.. ఇలా రెండిటిని బ్యాలెన్స్ చేసేవారిలో శృతి ముందుంటుంది.
తరచుగా ఫోటోషూట్స్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.
ప్రస్తుతం శృతి హాసన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. తెలుగు, తమిళంతో పాటు తను హిందీలో కూడా బిజీగా ఉంది.
తెలుగులో అడవి శేష్‌తో కలిసి ‘డెకాయిట్’ అనే మూవీలో నటిస్తోంది శృతి హాసన్.
‘డెకాయిట్’ తెలుగులో మాత్రమే కాకుండా హిందీలో కూడా ఒకేసారి షూటింగ్ జరుపుకుంటోంది.
దాంతో పాటు రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’లో కూడా ఒక కీలక పాత్రలో కనిపించనుంది శృతి.
ప్రభాస్‌తో జోడీకడుతూ నటించిన ‘సలార్’ హిట్ కాగా దాని సీక్వెల్ కూడా శృతి హాసన్ చేతిలో ఉంది.