ఛాతీలో మంట రావడానికి జీర్ణాశయంలోని ఆమ్లం అన్నవాహికలోకి వెళ్లడం వల్ల వస్తుంది.

దీర్ఘకాలిక యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నవారిలో తరచుగా ఛాతీలో మంట అనుభూతి కలుగుతుంది

కొన్ని ఆహారాలు, కారం, కొవ్వు పదార్ధాలు ఎక్కువగా తినడం వల్ల కూడా వస్తుంది

అంతే కాకుండా కొన్ని మందులు, నొప్పి నివారణలు వంటివి కూడా ఛాతీలో మంటను కలిగిస్తుంది

కొన్ని సందర్బాల్లో, ఛాతీలో మంట గుండెపోటు, ఆందోళన, ఇతర సమస్యలు కూడా కావచ్చు

ఛాతీలో మంటను తగ్గించడానికి తగినంత నీరు త్రాగాలి.

కఠినమైన ఆహారాలు, కెఫీన్, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి

ఆందోళన, ఒత్తిడి తగ్గించాలి. లేదంటే మంటను మరింత తీవ్రతరం చేస్తుంది

వేడి పాలను తాగడం వల్ల ఛాతీలో మంటను తగ్గించవచ్చు. అలాగే సమయానికి ఆహారం తీసుకోవాలి