చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది.
కానీ ఉదయం పూట ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఉదయం పూట టీ తాగితే నోటి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది.
అంతే కాకుండా దంతక్షయం, దుర్వాసన, చిగుళ్ల సమస్యలు వస్తాయి.
నోటిలో ఏర్పడిన బ్యాక్టీరియాతో పాటు టీ కూడా కడుపులోకి వెళ్లినప్పుడు,అజీర్ణం, గ్యాస్ సమస్యను పెంచుతుంది.
నోటిలో ఉండే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించినప్పుడు, అది రోగనిరోధక శక్తిని బలహీన పరుస్తుంది.