రోజూ ముఖానికి ఫౌండేషన్ రాయడం రొటీన్ గా మారింది.

ఫౌండేషన్ రాయడం వల్ల స్కిన్ బ్రైట్ గా, ఫెయిర్ గా కనిపిస్తుంది.

ముఖంపై రంధ్రాలు పూడుకుపోతాయి. ఫౌండేషన్ ను సరిగ్గా క్లీన్ చేయకపోతే మురికి, మృతకణాలు చర్మంలోపలే ఉండిపోతాయి.

ఫలితంగా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, మొటిమలు ఏర్పడుతాయి.

రోజంతా ముఖంపై ఫౌండేషన్ ను ఉంచితే అలెర్జీ, దురద, దద్దుర్లు, వాపు వంటివి వచ్చే ప్రమాదం ఉంది.

ఫాండేషన్లలో ఉండే మ్యాట్ ఫినిష్ పౌడర్లు స్కిన్ నుంచి ఆయిల్ ను గ్రహిస్తాయి. దీనివల్ల చర్మం పొడిబారుతుంది.

త్వరగా ఏజింగ్ లక్షణాలు కనిపిస్తాయి. ముఖంపై ముడతలు, గీతలు పెరుగుతాయి.

వాటిలో ఉండే రసాయనాలు, సింథటిక్ సువాసనలు ఆక్సీకరణ ఒత్తిడికి కారణమవుతాయి.

గ్లిజరిన్, హైలురోని యాసిడ్ వంటి వాటితో తయారుచేసిన హైడ్రేటింగ్ ఫౌండేషన్లను వాడటం మంచిది.

ఫౌండేషన్ వేసుకుంటే.. ఇంటికి వచ్చాక పూర్తిగా క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. వీలైనంత వరకూ ఫౌండేషన్ కు దూరంగా ఉండటమే ఉత్తమం.