జుట్టుకు రంగు వేస్తున్నారా ? అయితే ఈ సమస్యలు పక్కా !
చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య చాలామందిని వేధిస్తోంది.
మారుతున్న ఆహారపు అలవాట్లు, కాలుష్యంతో పాటు వివిధ కారణాల వల్ల జుట్టు రంగు మారుతోంది.
చాలా మంది హెయిర్ కలర్స్ వాడుతుంటారు. కానీ హెయిర్ కలర్స్ వాడటం వల్ల అనేక సమస్యలు వస్తాయి.
తెల్ల జుట్టు సమస్యను పరిష్కరించుకోవడం కోసం రకరకాల షాంపులను కూడా వాడతారు.
జుట్టుకు హెయిర్ కలర్స్ వేసుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టుకు రంగు వేయడం వల్ల హెయిర్ నాచురల్ కలర్ తొలగిపోతుంది.
హెయిర్ కలర్స్ ఎక్కువగా వాడడం జుట్టు పెలుసుగా మారి తెగిపోతుంది.
మార్కెట్లో దొరికే చాలా హెయిర్ కలర్స్ లో కెమికల్స్ ఉంటాయి. వీటి వల్ల చికాకు, అలర్జీలు వంటివి వస్తాయి.
అందుకే కలర్ వేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని నిపుణులు చెబుతున్నారు