భారత దేశంలో టీ ప్రియులకు కొదవలేదు. చాలా మందికి ఎప్పుడు టీ ఇచ్చినా సరే ఇష్టంగా తాగుతారు.
కొందరు వ్యక్తులు రోజుకు 5-6 కప్పుల వరకు టీ తాగుతారు. టీ ఎక్కువగా తాగడం వల్ల శారీరక సమస్యలు తలెత్తుతాయి.
పరిమిత పరిమాణంలో టీ తాగితే మంచిది, కానీ అంతకు మించి టీ తాగితే అనేక సమస్యలు వస్తాయి.
టీ ఎక్కువగా తాగడం వల్ల జీర్ణ సమస్యలు కూడా వస్తాయి.
సాధారణ వ్యక్తుల కంటే టీ ఎక్కువగా తాగే వారికి నిద్రకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉండవచ్చు.
అధిక మొత్తంలో కెఫిన్ తీసుకోవడం వల్ల నిద్రలేమి, విశ్రాంతి లేకపోవడం, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి.
జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే టీ తాగడం తగ్గించడం మంచిది.
టీలో ఉండే టానిన్లు కడుపులో యాసిడ్ స్థాయిలను పెంచుతాయి. దీంతో ఎసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి.
టీ ఎక్కువగా తాగే వారి శరీరంలో ఐరన్ తగ్గుతుంది. నిజానికి, టీలో ఉండే టానిన్ పేగుల్లో ఐరన్ శోషణను తగ్గిస్తుంది.