చలికాలంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి ఇలా..
చలికాలంలో వాతావరణం గుండెపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.
వింటర్ సీజన్‌లో గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు తీసుకోవాలి.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. వ్యాయామం తప్పకుండా చేయాలి.
చలికాలంలో సూర్యరశ్మి శరీరానికి పడేలా చూసుకోండి. ఎందుకంటే గుండె పనితీరుకు విటమిన్ డి కీలకపాత్ర పోషిస్తుంది.
శరీరానికి ఎక్కువగా చలి తగిలితే రక్తనాళాలకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఉన్ని దుస్తులు ధరించడం ఉత్తమం.
చలికాలం అయిన తగినంత నీరు తాగాల్సిందే. అప్పుడే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఒత్తిడి వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనికి తప్పనిసరిగా ధ్యానం చేయాలి.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. బాదం, వాల్నట్స్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.