చలికాలంలో చర్మం పూర్తిగా పొడిబారుతుంది. ఇలాంటి సమయంలో చాలా మంది స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు.
మార్కెట్ లో దొరికే రసాయనాలతో తయారు చేసిన ప్రొడక్ట్స్ వల్ల ముఖం తాత్కాలికంగా మెరిసిపోతుంది.
కానీ ఇంట్లోనే కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకుని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఉదయం పూట ముఖం కడుక్కుంటే.. కొంత మందికి చర్మం పొడిబారడం ప్రారంభమవుతుంది.
మీరు మీ చర్మంలోని సహజ నూనెను కోల్పోకూడదనుకుంటే బియ్యంపిండితో ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని వాడటం మంచిది.
మిక్సీ జార్‌లో బియ్యాన్ని బాగా గ్రైండ్ చేసి మెత్తగా పొడిగా చేసుకోవాలి. ఇందులో పసుపు, పెరుగు కలిపి ముఖానికి పట్టించాలి.
తర్వాత 15 నిమిషాలు ఆగి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఇలా తరుచుగా చేయడం వల్ల గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.