ముఖంపై మొటిమలు, మచ్చలతో ఇబ్బందిపడే వారు ఇంట్లోనే కొన్ని ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకుని వాడచ్చు.

శనగపిండి, పెరుగుతో తయారుచేసిన ఫేస్ ప్యాక్‌లు చర్మంపై ముడతలను తొలగించడంలో సహాయపడతాయి.

జిడ్డు తొలగిపోతుంది: పెరుగు, శనగ పిండిని ముఖానికి ఉపయోగించడం వల్ల చర్మంపై జిడ్డు తొలగిపోతుంది.

పెరుగు, శనగపిండి మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల పిగ్మెంటేషన్ సమస్య తొలగిపోతుంది.

 ఇది చర్మం రంగును క్లియర్ చేస్తుంది. అంతే కాకుండా ముఖంపై pH స్థాయిని మెరుగుపరుస్తుంది.

శనగపిండిలో నీరు కలిపి ఆ ఫేస్ట్ తో ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోతుంది.

 శనగపిండి, పెరుగు కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం మెరుస్తుంది.

ముఖం డ్రైగా మారితే పెరుగు శనగపిండితో తయారుచేసిన ఫేస్  అప్లై చేయాలి.

 ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంతే కాకుండా చర్మాన్ని శుభ్రపరచడానికి ఇది  ఎంతగానో ఉపయోగపడుతుంది.